కుళాయి నీరు కాలుష్యం.. ప్రజల్లో ఆందోళన

NLR: ఉదయగిరి మేజర్ పంచాయతీలో కుళాయిల ద్వారా వస్తున్న మురికి నీరు, దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహ అవసరాలకే ఉపయోగించే నీరు అశుద్ధంగా ఉండటంతో ఆరోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని వాపోతున్నారు. త్వరితగతిన పరిష్కారం కోరుతున్నారు.