నరసన్నపేటలో అనుమానితుల సంచారం.. పోలీసులకు ఫిర్యాదు

నరసన్నపేటలో అనుమానితుల సంచారం.. పోలీసులకు ఫిర్యాదు

SKLM: నరసన్నపేట పట్టణంలో ఇస్లాం మతానికి చెందిన కొందరు అనుమానస్పదంగా సంచరించడం పట్ల విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పట్టణంలో ఉన్న ముస్లింల కుటుంబాలకు బంధువులుగా చెప్పుకొని సంచరిస్తున్నారని అన్నారు. పహల్గాంలో జరిగిన ఘటనలు జరిగే ప్రమాదం ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు, తహసిల్దార్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.