చిట్టి చేతులు పెద్ద మనస్సు

చిట్టి చేతులు పెద్ద మనస్సు

SRD: సదాశివపేట మండలం నిజాంపూర్ ప్రాథమిక పాఠశాలో చదువుతున్న విద్యార్థులు సైనికుల సంక్షేమ నిధి కోసం విరాళాలను రూ.3333 సేకరించారు. సేకరించిన విరాళాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు అందచేశారు. విద్యార్థులు చిన్న వయస్సులో ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని విద్యాధికారి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శంకర్, హెచ్ఎం రామకృష్ణ పాల్గొన్నారు.