VIDEO: నల్ల బ్యాడ్జి ధరించి జూనియర్ లైన్‌మెన్‌ల నిరసన

CTR: పుంగనూరు ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు జూనియర్ లైన్‌మెన్‌లు సోమవారం నల్ల బ్యాడ్జి ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూనియర్ లైన్‌మెన్‌లను పాత సర్వీస్ రూల్స్ ప్రకారం అసిస్టెంట్ లైన్‌మెన్‌లుగా పదోన్నతి కల్పించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.