జనాభా గణనలో ఓబీసీల లెక్క తేల్చాలి: వీహెచ్

జనాభా గణనలో ఓబీసీల లెక్క తేల్చాలి: వీహెచ్

TG: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా గణనలో OBCల లెక్క తేల్చాలని PCC మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కోరారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే CM రేవంత్ నేతృత్వంలో కులగణన చేపట్టామని గుర్తు చేశారు. గతంలో జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో BCలు గెలుపొందారని తెలిపారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో జరిగే జనాభా గణనలో OBCలకు ప్రత్యేక కాలం కేటాయించాలని డిమాండ్ చేశారు.