'వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి'
ASR: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఆనంద్ కోరారు. శనివారం ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. అక్కడ వసతి గృహంలో మరుగుదొడ్లు లేవని, డైనింగ్ హాలు లేదని విద్యార్థులు తెలిపారు. అధికారులు స్పందించి, సమస్యలు పరిష్కరించాలని ఆనంద్ కోరారు.