గుక్కెడు నీటి కోసం నానా తంటాలు

ప్రకాశం: దొనకొండ మండలం బాదాపురం ఎస్పీ కాలనీకి సాగర్ నీరు రాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సార్లు అధికారులకు సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దాదాపు 5 నెలల నుంచి సాగర్ నీళ్ళు రాకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.