'షాపుల బకాయిలు వెంటనే చెల్లించండి'

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి చెందిన కొట్ల బాడుగలను వెంటనే చెల్లించాలని నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. రెండు రోజులలోగా బాడుగలు చెల్లించకపోతే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. వినాయక పట్టణంలోని 43 షాపులను సందర్శించి షాపులో ఉన్న యజమానులతో మాట్లాడారు. సాకులు చెబితే ఇకపై ఉపేక్షించేది లేదన్నారు.