మిత్రుడి కుటుంబాన్ని ఆదుకున్న సహచరులు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు గోడకూలి మృతి చెందిన శేకిది వెంకటేశ్వర్లు కుటుంబానికి క్లాస్ మెంట్లు సోమవారం రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 1997-98 లో వెంకటేశ్వర్లు తో పదవ తరగతి చదివిన మిత్రులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.