VIDEO: ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం
MNCL: బెల్లంపల్లి పట్టణం 28వ వార్డులో కరెంట్ స్తంభం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. MCPIU నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన స్పందించడం లేదని ఆరోపించారు. స్తంభం విరిగి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు నూతన స్తంభం ఏర్పాటు చేయాలన్నారు.