'వాళ్లు మన ఉద్యోగాలు, రేషన్ దోచుకుంటున్నారు'

'వాళ్లు మన ఉద్యోగాలు, రేషన్ దోచుకుంటున్నారు'

కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్, లాలూ కుమారుడి యాత్ర ఉద్దేశం ఏంటి? అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. చొరబాటుదారులను రక్షించేందుకే వారి యాత్ర అని ఆరోపించారు. చొరబాటుదారులను కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌గా మార్చుకుందన్నారు. వాళ్లు ఇక్కడి యువత ఉద్యోగాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు. పేదల రేషన్‌ను దోచుకుంటున్నారని తెలిపారు.