వైభవంగా నృసింహుని బ్రహ్మోత్సవాలు
ATP: ఉరవకొండ సమీపంలోని పెన్నహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం నృసింహస్వామిని హనుమంత వాహనంపై ఊరేగించారు. ఈ వేడుకల్లో ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.