పోలీస్ కార్యాలయంలో “మీకోసం”
కృష్ణా: మచిలీపట్నంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం “మీకోసం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రజలు హాజరై తమ ఫిర్యాదులను ఎస్పీ విద్యసాగర్ నాయుడుకి సమర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ఫిర్యాదులను ప్రత్యక్షంగా, సమయబద్ధంగా, పారదర్శకంగా, చట్టపరంగా పరిష్కరించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.