దోమకొండలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

KMR: దోమకొండ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో శుక్రవారం ఇంటింటికీ వెళ్తూ వైద్య సిబ్బంది ఫ్రైడే డ్రై డే చేపట్టారు. ప్రజలకు నీరు నిల్వ ఉండడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరించారు. దోమల పెరుగుదల వల్ల డెంగ్యూ, చికూన్ గున్యా, మలేరియా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని మెడికల్ ఆఫీసర్ డా.శిరీష సూచించారు.