జిల్లాలో రెండు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు
ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ నెల 17,18 తేదీల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, కూలీలు ఎండలో పనిచేసేటప్పుడు తరచూ నీడలో విశ్రాంతి తీసుకోవాలని, తగినంత నీరు తాగాలని కోరారు.