పైడితల్లి అమ్మవారి జాతరలో ఎమ్మెల్యే నల్లమిల్లి

పైడితల్లి అమ్మవారి జాతరలో ఎమ్మెల్యే నల్లమిల్లి

E.G: అనపర్తి మండలం రామవరంలో పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరై జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.