జిల్లాలో ఘనంగా ఎదుర్కోళ్ల సంబరాలు

జిల్లాలో ఘనంగా ఎదుర్కోళ్ల సంబరాలు

MBNR: జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని బికేరెడ్డి కాలనీ శివాంజనేయ స్వామి దేవాలయంలో నేడు సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. నేటి తెల్లవారుజామున బికే రెడ్డి కాలనీలో ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శివాంజనేయ భజన మండలి, మహిళ సేవా బృందం, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.