వీధి కుక్కలు స్వైరవిహారం పట్టించుకోని అధికారులు

ప్రకాశం: చీరాలలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.మూడు వందల కాలనీలో మున్సిపల్ స్కూల్ వద్ద ఓ కుక్క పాదచారుల పై దాడి చేసింది. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఇప్పటి వరకు అదే కుక్క 30 మందిని పైగా గాయపరిచింది. తరుచూ ఎంతో మంది పాదచారుల పై దాడి చేస్తున్నా కుక్కల నియంత్రణ చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.