పెనుగొండ స్టేషను తనిఖీ చేసిన డీఎస్పీ
W.G: నరసాపురం డీఎస్పీ డాక్టర్ జి. శ్రీవేద ఇవాళ పెనుగొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, సీజ్ వాహనాలు, క్రైమ్ వివరాలను ఎస్సై గంగాధర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా, ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని డీఎస్పీ సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు.