'ఆటో డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి'

JN: మూడు చక్రాల బండిని నమ్ముకొని అష్ట కష్టాలు పడుతూ బతుకు బండిని ఈడుస్తున్న ఆటోడ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు జలగం ప్రవీణ్ డిమాండ్ చేశారు. స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు వెంటనే నెలకు రూ.12000 ఇవ్వాలని సూచించారు.