కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు

కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు

SRPT: పెన్‌పహాడ్‌ మండలంలోని అనంతారంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈరోజు కిరాణా షాపుకు వెళ్తున్న బాలికపై కుక్కల గుంపు దాడి చేసి ముఖం, చేతిపై తీవ్రంగా కరిచాయి. స్థానికులు స్పందించి కుక్కలను తరమడంతో బాలిక ప్రాణాలతో బయటపడింది.  ప్రస్తుతం ఆమె ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుక్కల బెడద నుంచి రక్షించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.