ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
SRPT: ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గరిడేపల్లిలో చోటుచేసుకుంది. కేతవారిగూడెం గ్రామానికి చెందిన మాతంగి రాజు(45) ద్విచక్రవాహనంపై లక్ష్మీపురం నుంచి గ్రామానికి తిరిగి వస్తుండగా.. సర్వారం గ్రామసమీపంలో అతని బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. రాజు లక్ష్మీపురం చర్చి పాస్టర్‌గా ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.