ఉపాధి హామీ కార్యాలయాన్ని పరిశీలించిన ఏపీడీ

KMM: ఇటీవల ఏన్కూరు మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చలపతిరావు కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు సంబంధించిన ఫైళ్లు మొత్తం మంటల్లో కాలిపోవడంతో సంబంధిత ఫైళ్లను క్షుణంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.