నకిలీ ఎరువుల పట్టివేత

నకిలీ ఎరువుల పట్టివేత

ప్రకాశం: మార్కాపురంలోని జాతీయ రహదారిపై నకిలీ ఎరువులు పట్టుబడ్డాయి. శుక్రవారం రాత్రి పక్కా సమాచారంతో లారీలో తరలిస్తున్న 291 బస్తాల నకిలీ ఎరువులను వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొంతమంది యువతీ ,యువకులు గ్రామాల్లో పర్యటించి రైతులకు నాణ్యమైన ఎరువులు అందిస్తామని నమ్మించి రాత్రి సమయాల్లో ఎరువులు తరలిస్తుండగా పట్టుకున్నారు.