శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర సౌకర్యాలపై ఎమ్మెల్యే సమీక్ష
HNK: ఆత్మకూరు మండలం ఆగ్రహం పాడులోని శ్రీసమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో అధికారులతో మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌తో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతర కోసం చేపట్టిన వసతి, భక్తుల సౌకర్యాల పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. భక్తులు భద్రతగా, సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.