ఆటో బోల్తా ఒకరి మృతి, ముగ్గురుకి గాయాలు
WGL: సంగెం మండలం ఆశాలపల్లి బస్టాండ్ సమీపంలో సోమవారం ప్యాసింజర్ ఆటో బోల్తా ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు స్వల్ప గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుడు మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన పొన్నం వీరేష్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.