"వేధింపుల వల్లే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది"

"వేధింపుల వల్లే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది"

WGL: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థిని తల్లి తాజాగా మీడియాతో మాట్లాడారు. సీనియర్ల వేధింపుల వల్లే నా కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించింది. 3 రోజులు పాటు ఆరుగురు శ్రీవిద్యను రబ్బార్ బ్యాండ్‌లతో కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. నా కూతురు చావుకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలి అని ఆమె డిమాండ్ చేసింది.