అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ సీజ్
GDWL: కర్ణాటక నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను కేటిదొడ్డి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. SI శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయచూర్ నుండి గంగనపల్లికి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.