నెహ్రూకు నివాళులు అర్పించిన కలెక్టర్
NRPT: పట్టణంలోని పళ్ళ వీధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బాలల దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలలో ముందుండాలని చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టమని చెప్పారు.