బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం: SI

MLG: తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం ఉదయం ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనాలకు సరైన ధృవపత్రాలు ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని, మండలంలో రోజూ పెట్రోలింగ్ చేస్తామని అనవసరమైన చిక్కుల్లో పడి కేసుల్లో ఇరుక్కోవద్దని SI తెలిపారు.