తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాలు : సీపీఐ

NLG: మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాలు భాగంగా గ్రామంలో దేవరకొండ రాములు స్థూపం దగ్గర ఘనంగా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తెలంగాణ రైతంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ పార్టీ వక్రీకరించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నది అన్నారు.