రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
NLG: గుర్రంపోడు మండలం జువ్విగూడెం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బైక్ పై వెళ్తున్న యువకుడు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్లపల్లి అంజిరెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.