సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

PLD: వినుకొండ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 204 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1,20,68,518 విలువైన చెక్కులను MLA జీవీ ఆంజనేయులు నిన్న అందజేశారు. ఆపదలో ఉన్న ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సహాయం అందుతుందని తెలిపారు. వైద్య సహాయం కోసం ఈ నిధులు సద్వినియోగం చేయాలన్నారు.