బీజేపీ టౌన్ మాజీ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు

NRML: భైంసా పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బాలాజీ సూత్రవేను సస్పెండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా నిబంధనలు ఉల్లఘించి పార్టీ నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో పార్టీకి వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.