శాంతి ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే

శాంతి ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే

ASR: కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం బాధాకరమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని కోరారు. ఈమేరకు ఆదివారం రాత్రి అరకు నాలుగు రోడ్ల కూడలి వద్ద కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించామని ఎమ్మెల్యే తెలిపారు.