'రోడ్లపై చెత్త వేయవద్దని అవగాహన'
MDK: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని చిన్న శంకరంపేట సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ సూచించారు. చిన్న శంకరంపేటలో సోమవారం పలు వార్డుల్లో పర్యటించిన సర్పంచ్ వీధులలో చెత్త వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తిరుగుతున్న చెత్త బండిలో చెత్త వెయ్యాలని ప్రజలకు అవగాహన కల్పించారు.