దుబాయ్ చేరుకున్న మంత్రి నారాయణ
AP: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారాయణ బృందం దుబాయ్‌లో పర్యటించనుంది. ఈ మేరకు ఆయన దుబాయ్ చేరుకున్నారు. విశాఖపట్నంలో నవంబరు 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. కాగా నవంబర్ 6 వరకు మంత్రి దుబాయ్‌లోనే ఉండనున్నారు.