భారీగా పట్టుబడ్డ అక్రమ గ్యాస్ సిలిండర్లు
SRPT: జిల్లాలో సివిల్ సప్లై అధికారులు అక్రమ గ్యాస్ నిల్వలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇవాళ కోదాడ పట్టణంలో డీసీఎస్‌వో మోహన్ బాబు ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 49 గ్యాస్ సిలిండర్లు పట్టుబడ్డాయి. కోదాడ పట్టణ పరిధిలోని ఓ హోటల్లో 6, ఓ ఇంటిలో 43(కమర్షియల్-1, డొమెస్టిక్-42) సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.