జిల్లాలో 5787 మంది చేనేతలకు లబ్ధి
బాపట్ల: జిల్లాలోని చేనేతల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మగ్గాలకు ఉచిత విద్యుత్ పథకం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడంతో వేలాది నేతన్నల కుటుంబాలకు ఆర్థిక ఊరట లభిస్తోంది. విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో వృత్తిపై నమ్మకం పెరిగిందని చేనేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాలో 5787 మంది లబ్ది పొందనున్నారు.