23 నుంచి కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
NLR: అల్లూరు పట్టణములోని శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో ఈనెల 23 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 23న అంకురార్పణ, 24 ధ్వజారోహణం, శేష వాహనం, హంస వాహనం, 25 హనుమంత సేవ, 26 గరుడ సేవ, 27న కళ్యాణం, 28 రథోత్సవం, 29 ఏకాంత సేవ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవాలన్నారు.