చెన్నూర్ ఆధార్ సెంటర్ ప్రారంభించాలని వినతి

చెన్నూర్ ఆధార్ సెంటర్ ప్రారంభించాలని వినతి

మంచిర్యాల: చెన్నూర్‌లో ఆధార్ సెంటర్‌ను ప్రారంభించాలని కోరుతూ.. చెన్నూరు మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు జాడి తిరుపతి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చెన్నూరు మండలం చుట్టుపక్కల గ్రామాల ప్రజల సౌకర్యార్థం ఆధార్ కార్డు సెంటర్‌ను ప్రారంభించి ఇబ్బందులను తొలగించాలని కోరినట్లు పేర్కొన్నారు.