అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీ, బిడ్డ క్షేమం

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీ, బిడ్డ క్షేమం

ASF: సిర్పూర్ (యూ)లోని అమృతరావు గ్రామానికి చెందిన తొడసం గిరిజ బాయికి సోమవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. స్పందించిన అంబులెన్స్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గిరిజ బాయి మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని తెలిపారు.