నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
SRPT: అనంతగిరి మండలం చనుపల్లి సబ్ స్టేషన్‌పరిధిలో అత్యవసర మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ సీతారాం శుక్రవారం తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చనుపల్లి, త్రిపురారం, పాలారం, పాలారం తండా, రంగాయిగూడెం గ్రామాల్లో కరెంటు ఉండదు. ఈ ఐదు గంటల పాటు ప్రజలు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.