'ఎన్నడూ లేని విధంగా రేషన్ మాఫియా నడుస్తోంది'
NTR: విజయవాడలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో రేషన్ మాఫియా నడుస్తోందని అన్నారు. కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రేషన్ మాఫియాలో భాగస్వామ్యం అయ్యారని విమర్శించారు. పేదలు తినే బియ్యాన్ని కూడా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.