రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

PDPL: ముత్తారం మండలం మైదంబండ శివారు పోతారం బస్టాండ్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోతారం నివాసి బత్తుల సదయ్య బైక్‌పై రోడ్డు దాటుతుండగా గోదావరిఖని నుంచి కోటంచ జాతరకు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సదయ్యను స్థానికులు 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.