అధ్వానంగా మారిన రోడ్డు.. 5 గ్రామాలకు రాకపోకలు బంద్

అధ్వానంగా మారిన రోడ్డు.. 5 గ్రామాలకు రాకపోకలు బంద్

ADB: సిరికొండ మండల కేంద్రం నుంచి వాయిపేట్ గ్రామానికి వేళ్ళ మార్గమధ్యలో ఉన్న బ్రిడ్జి గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పూర్తిగా నిండిపోయింది. దీంతో వర్షపునీరు రోడ్డుపై ప్రవహించడంతో రహదారి అధ్వానంగా మారింది. ఈ మేరకు వాయిపేట్, చిమన్ గూడి, చింతగూడ, ధర్మసాగర్, భీంపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.