'LIC ఆఫీసు ముందు చెత్త.. ప్రయాణికుల ఇబ్బందులు'
VKB: తాండూరు పట్టణంలోని LIC ఆఫీసు ముందట చెత్త పేరుకుపోవడంతో ప్రయాణికులు దుర్వాసన వస్తుందని వాపోతున్నారు. పట్టణంలోని చాలా ప్రధాన రహదారుల్లో ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. మున్సిపల్ కార్మికులు చెత్త తొలగించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు మున్సిపల్ అధికారులు స్పందించి ప్రధాన రహదారుల్లోని చెత్తను తొలగించాలని కోరుతున్నారు.