తాత్కాలిక సెల్ టవర్‌ను ఏర్పాటు చేసిన యంత్రాంగం
NLR: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమమైన జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టింది. నెల్లూరు కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ వద్ద సెల్ ఫోన్ సిగ్నల్స్‌కు అంతరాయం లేకుండా తాత్కాలికంగా సెల్ టవర్‌ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.