VIDEO: NHM ఉద్యోగుల జీతాలను వెంటనే చెల్లించాలి: గంగాధర్
WGL: రాష్ట్ర వ్యాప్తంగా NHMలో పనిచేస్తున్న ఉద్యోగులు నెలల తరబడి జీతాలు ఆలస్యమవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని AITUC రాష్ట్ర కమిటీ సభ్యుడు గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ WGL జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఈ ఉద్యోగులు పెండింగ్ బకాయిలతో రుణభారంలో చిక్కుకున్నారని, వెంటనే బకాయిలను చెల్లించాలని కోరారు.