బెల్లంపల్లిలో బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

ADB: బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి గాయాల పాలైన ఘటన బుధవారం బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. పాత బస్టాండ్ నుంచి మార్కెట్ ఏరియాకు బైక్ పై వెళ్తున్న వ్యక్తి కాంగ్రెస్ ఆఫీస్ చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.